telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

తెలుగు సీఎంలకు నిర్మాతల మండలి లేఖ.. అందులో..?

కరోనా లాక్ డౌన్ తరువాత మళ్ళీ ఈ మధ్యే థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. అయితే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం జనవరి 4న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సింగిల్ అండ్ మల్టీప్లెక్ట్స్ థియేటర్లనూ నూరు శాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవచ్చునంటూ జీవో జారీ చేసింది. కరోనా కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అమలు చేస్తూనే, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ ను ఫాలో అవ్వమని ఆ జీవోలో పేర్కొంది. దాంతో ఈ నెల 13న విడుదల కాబోతున్న విజయ్ ‘మాస్టర్’, శింబు ‘ఈశ్వరన్’ చిత్రాల నిర్మాతల నెత్తిపై పాలు పోసినట్టు అయ్యింది. తెలుగులోనూ సినీ రంగానికి సంక్రాంతి సీజన్ అతి ప్రధానమైంది. ‘మాస్టర్’ డబ్బింగ్ వర్షన్ తో పాటు స్ట్రయిట్ తెలుగు సినిమాలు ‘క్రాక్’, ‘రెడ్’, ‘అల్లుడు అదుర్స్’ ఈసారి సంక్రాంతి బరిలో నిలువబోతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమిళనాడులో మాదిరి థియేటర్ల ఆక్యుపెన్సీని నూరు శాతానికి పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలుగు నిర్మాతల మండలి కార్యవర్గం కోరుతోంది. కరోనా బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ థియేటర్లను నిర్వహించడం ఖర్చుతో కూడుకున్న పని అని, యాభై శాతం ఆక్యుపెన్సీతో దానిని నిర్వహించడం ఎగ్జిబిటర్లకు కష్టమవుతోందని, నష్టాలు పెరిగిపోతున్నాయని, కాబట్టి ఆక్యుపెన్సీని 100 శాతానికి పెంచుతూ జీవో జారీ చేయమని నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శులు తుమ్మల ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల ఓ ప్రకటనలో కోరారు. చూడాలి మరి ఈ విషయం పై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయి అనేది.

Related posts