telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పై కేసు

yarapathineni tdp

అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై కేసు నమోదయింది. గురజాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో యరపతినేని అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని గురవాచారి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీన్ని పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు, యరపతినేనిపై కేసు నమోదు చేయాలని పిడుగురాళ్ల పోలీసులను ఆదేశించింది.

దీంతో టీడీపీ నేత యరపతినేనితో పాటు మరో 12 మందిపై పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదుచేశారు. గతంలో యరపతినేని రూ.300 కోట్ల మేర అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. అక్రమ మైనింగ్ ప్రాంతంలో పర్యటించేందుకు వైసీపీ నిజనిర్ధారణ కమిటీ అప్పట్లో ప్రయత్నించగా పోలీసులు ఆ పార్టీ నేతలను అరెస్ట్ చేశారు.

Related posts