telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ స్కూల్స్ లో విజృంభిస్తున్న కరోనా…

ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసుసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ మశ్య కరోనా కేసులు కాస్త తగ్గడంతో స్కూల్స్, కాలేజీలు ప్రారంభించారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. వైరస్‌ బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న రెండు ప్రభుత్వ పాఠశాలల్లో 28 కరోనా కేసులు నమోదయ్యాయి. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని ఎస్టీ బాలుర వసతిగృహంలో మొత్తం 105 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా అందులో 22 మంది  విద్యార్థులతో పాటు వార్డెన్‌కు, వాచ్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. పెద్ద సంఖ్యలో  విద్యార్థులు కరోనా బారిన పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్‌ నిర్ధారణ అయిన విద్యార్థులను  పాఠశాలలోని రెండో అంతస్తులో ఐసోలేషన్‌లో ఉంచారు. మిగిలిన విద్యార్థులను ఇంటికి పంపించారు. అయితే చూడాలి మరి ఈ విషయాల పై ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది అనేది.

Related posts