*తెనాలిలో బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..
*ఒక్క ఛాన్స్..ఒక తప్పిదం చేశారు..
*అనుభవిస్తున్నారు..ఆత్మ విమర్శచేసుకోండి..
*ప్రజలు ఆలోచించాలి..ఓటు అంటే నోటు కాదు..
*జగన్ ప్రభుత్వం గుడిని గుడిలో లింగాన్ని మింగేసిరకం
జగన్ ప్రభుత్వం గుడిని గుడిలో లింగాన్ని మింగేసిరక మని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు…
తెనాలి పెమ్మసాని థియేటర్‌లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను బాలకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు అలనాటి నటి ప్రభ, సినీ రచయిత బుర్రా సాయిమాధవ్, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్ అంటే ఒక్క తప్పిదం చేశారు.. ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇక అనుభవించకండి. ఆత్మ విమర్శ చేసుకోండి.. మనుషుల్లా బతకండి…ఓటు అంటే నోటు కాదని సూచించారు. ఓటు సరిగ్గా వేస్తే గుడి బడి రెండూ ప్రజలకు చెరువులో ఉంటాయని అన్నారు.
అధికారం కోసం కులాలను, మతాలను వాడుకుంటున్నారో ఇప్పుడు చూస్తున్నామని అన్నారు. అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. మనందరిది ఒక కుటుంబం అని బాలకృష్ణ చెప్పారు.
తెలుగువారు ఆత్మగౌరవం నిలబెట్టేందుకు నేనున్నాను అని ముందుకు వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ బాలకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. సామాన్య రైతుగా కెరీర్ ప్రారంభించిన ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా, కళాకారునిగా, ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు.
సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని భావించిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. తెలుగువాడికి ఏ అవసరం ఉన్న నేనున్నానని ముందుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఆనాడూ తెలుగుదేశం పార్టీని అందరూ భుజాలపై మోశారని.. ఈ ఉత్సవాలను కూడా రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా నిర్వహించనున్నట్టుగా చెప్పారు.
” అమ్మ ఒడి” ని ఓర్వలేక చంద్రబాబు దుష్ప్రచారం: రోజా