telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బ్రాహ్మణులపై కక్ష కట్టిన చంద్రబాబు

Chandrababu comments Jagan cases

ఏపీ సీఎం చంద్రబాబు బ్రాహ్మణులపై కక్ష కట్టారని అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్‌ మండిపడ్డారు. తన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్‌ చంద్ర పునేఠను తాను చెప్పినట్టే వినాలని ఒత్తిడి తెచ్చి ఆయనను బలిపశువును చేశారని ఆరోపించారు. ఆయన స్థానంలో ఎన్నికల సంఘం మరో బ్రాహ్మణ ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రమణ్యంను సీఎస్‌గా నియమిస్తే ఆయననూ అవమానించేలా మాట్లాడారంటూ దుయ్యబట్టారు.

ఎల్వీ సుబ్రమణ్యంను సీఎస్‌గా ఎంపిక చేయడంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్‌ అధికారుల సంఘంతో పాటు వివిధ ఉద్యోగుల సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు అడ్వకేట్‌ జనరల్‌ వేణుగోపాల్‌ విషయంలోనూ, రవాణా శాఖ కమిషనర్‌ బాలసుబ్రమణ్యం విషయంలోనూ వ్యవహరించిన తీరే బ్రాహ్మణులు ఇప్పటికీ మరిచిపోలేకుండా ఉన్నారని రవికుమార్‌ వ్యాఖ్యానించారు.

Related posts