లోక్‌సభలో ప్రభుత్వ విప్‌గా నియమితుడైన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆ పదవి తనకొద్దంటూ తిరస్కరించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ నుంచి టీడీపీ తరపున ముగ్గురు ఎంపీలు గెలుపొందగా అందులో నాని ఒకరు. ఆయనకు ప్రభుత్వ విప్ పదవి కట్టబెడుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
పార్టీ అధినేత చంద్రబాబు నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఆ పదవి చేపట్టేంత అర్హత నాకు లేదని భావిస్తున్నాని అన్నారు. అందుకే ఆయన ఆదేశాలు తిరస్కరిస్తూ మరో సమర్థుడిని ఆ పదవిలో నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నాని చెప్పారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో, నాని స్థానంలో ఎవరిని నియమిస్తారో వేచి చూడాలి.