telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

సోనూ సూద్ కు మరో అరుదైన గౌరవం..

Sonusood

వలస కార్మికులకు లాక్ డౌన్ వేళ అండగా నిలిచి సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నారు. దేశ వ్యాప్తంగా వేలాది మంది వలస కార్మికులను తమ తమ గమ్యస్థానాలకు చేర్చడంలో సోనూ సూద్ చేసిన సాయం అంతా ఇంతా కాదు. బస్సు.. రైళ్లు.. విమానం ఇలా ఎవరికి ఏది అవసరమో అది బుక్ చేసి మరి వారి గమ్య స్థానాలకు చేర్చారు. సోనూసూద్ కేవలం వలస కార్మికుల ట్రాన్స్ పోర్ట్ మాత్రమే కాకుండా ఎవరైతే వలస కార్మికులు నడుచుకుంటూ వెళ్తూ చనిపోయారో వారి కుటుంబాలకు కూడా సాయం చేశారు. సోషల్ మీడియా ద్వారా వచ్చిన వందలాది రిక్వెస్ట్ లకు కూడా స్పందించి తనకు తోచిన సహాయం చేస్తూ వచ్చాడు. ఇక అప్పుడు మొదలు పెట్టిన మంచి పనులు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇటీవల సోనూ పేద విద్యార్థుల‌ కోసం ఓ ప్రత్యేక స్కాలర్‌షిప్ కార్య‌క్ర‌మాన్ని కూడా రూపొందించిన విషయం తెలిసిందే. ఆయన చేసిన ఈ మంచి పనులకు గాను ఆయనకు ఒక అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే ఈయనకు పంజాబ్ స్టేట్ ఐకాన్ గా భారత ఎన్నికల సంఘం నియమించినట్లు ప్రకటించింది. ECI కి పంపిన ప్రతిపాదనను అంగీకరించిందని పంజాబ్ స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పేర్కొన్నారు. సోనూ సూద్ పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లాకు చెందిన వ్యక్తి అనే విషయం తెలిసిందే.  

Related posts