telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ : .. పిట్టల్లా రాలిపోతున్న .. ఆర్టీసీ కార్మికులు.. గుండెపోటుతో పలువురు మృతి..

tsrtc employees died with govt decision

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన నేపధ్యం లో పలువురు కార్మికులు గుండెపోటు తో మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో గత ఏడు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే. సమ్మె చేస్తోన్న కార్మికుల్ని విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం తో పలువురు కార్మికులు తమ ఉద్యోగం పోయిందని తీవ్ర మానసిక ఒత్తిడికి గురయి గుండె ఆగి చనిపోయారు. హెచ్ సి యూ డిపో కు చెందిన సీనియర్ డ్రైవర్ ఎస్ కె ఖలీల్ మియా, ప్రభుత్వ ప్రకటన అనంతరం తన ఉద్యోగం పోయిందన్న ఆందోళనతో గుండెపోటు కు గురయి, ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

చెంగిచర్ల డిపో కు చెందిన మరొక డ్రైవర్ కొమురయ్య కూడా తన ఉద్యోగ భద్రత పై ఆందోళన చెందుతూ, తీవ్ర మనస్థాపానికి గురయి గుండెపోటు మృతి చెందగా, హాకింపేట డిపో లో కండక్టర్ గా విధులు నిర్వహిస్తోన్న పద్మ భర్త కూడా భార్య ఉద్యోగం పోయిందని చేసిన రుణాలు ఎలా చెల్లించాలో తెలియక తీవ్ర మానసిక ఒత్తిడి తో గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమ్మె కు వెళితే రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందని భావిస్తే, విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడాన్ని ఆర్టీసీ కార్మికులు జీర్ణించుకోలేపోతున్నారు. తమకు వచ్చేది అంతంత మాత్రం జీతాలేనని, ఇప్పుడు విధుల్లో నుంచి తొలగించమని ప్రభుత్వం ప్రకటించడం తో అవి కూడా రాకపోతే తమ పరిస్థితి ఏమిటని ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts