telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇంకా సమయం కావాలంటూ.. కొరిటాలశివను ఊరిస్తున్న .. చిరంజీవి..

anasuya with chiranjeevi in koritala movie

ఆ దర్శకుడు తీసిన నాలుగు సినిమాలు సూపర్ డూపర్ హిట్లు, అందుకని బ్లాక్ బస్టర్ మరియు అపజయం లేని డైరెక్టర్ అయ్యాడు కొరటాల శివ. చివరిగా కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా ‘భరత్ అనే నేను’ విడుదలయి దాదాపు ఏడాది కావస్తున్నా క్రమంలో చిరంజీవి తో చేయబోయే సినిమా ఇంకా ప్రారంభం కాని క్రమంలో కొరటాల అభిమానులు చిరంజీవి తో చేయబోయే సినిమా కోసం తెగ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘సైరా’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న క్రమంలో ఈ సినిమాలో చిరంజీవి బాగా లావుగా ఉన్న నేపథ్యంలో కొరటాల శివ సినిమా కోసం లావు తగ్గడానికి ఇంకా నాకు టైం కావాలని, క్యారెక్టర్ కు తగ్గ విధంగా బాడీ మార్చుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని చిరంజీవి, కొరటాల ని కోరినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.

చిరంజీవి తో కొరటాల శివ చేయబోయే సినిమా కమర్షియల్ ప్లస్ మెసేజ్ ఓరియెంటెడ్, సైరా లుక్స్ సెట్ కావు. కొంత స్లిమ్ అవ్వాల్సి ఉంటుంది. రెండు షేడ్స్ కాబట్టి తేడా చూపించాలి అంటే ఫిజిక్ పరంగా మార్పులు తప్పనిసరి. దీనితో చిరంజీవి కోరిన విధంగానే కొరటాల వెయిట్ చేయడానికి రెడీ అయ్యారట. మరోపక్క చిరంజీవి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పర్సనల్ ట్రైనర్ ఆధ్వర్యంలో బరువు తగ్గే వర్కౌట్స్ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. అంటే ఈ కాంబోలో సినిమా ఇంకా ఆలస్యం కాకతప్పదన్నమాట..!!

Related posts