telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

శ్రీ శైలం దుకాణాల వేలం పాట రద్దు

srisailam temple

శ్రీ శైలం దుకాణాల వేలం పాటను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లలితాంబిక వాణిజ్య సముదాయంలోని దుకాణాలకు ఇటీవల నిర్వహించిన వేలంపాటపై ఆరోపణలు తలెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.

దుకాణాల వేలం పాట రద్దుకు తగిన చర్యలు తక్షణమే చేపట్టాలని దేవాదాయ శాఖ కమిషనర్ కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై పూర్తి వివరాలు అందిన అనంతరం తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అవినీతి లేని పారదర్శక పరిపాలనే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అన్నారు. దేవాలయాలలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. శ్రీశైల దేవస్థానం పరిరక్షణ కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

Related posts