telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విశాఖ పర్యటనలో బాబు.. వైసీపీ నాలుగు నెలల పాలన అధమంగా ఉందంటూ విమర్శలు..

chandrababu gift on may day

జిల్లాలో పర్యటిసున్న చంద్రబాబు నాలుగు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. విశాఖ జిల్లాలో వివిధ నియోజకవర్గాల నేతలతో నిర్వహించిన సమీక్షలో తెదేపా అధినేత చంద్రబాబు మాట్లాడారు. కొత్త రక్తానికి తెదేపాలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. సరిదిద్దుకోలేని స్థాయిలో రాష్ట్రానికి నష్టం కలుగుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అసమర్థత వల్లే కరెంటు కోతలు అని మండిపడ్డారు.

మందుబాబుల వద్ద కూడా జే-ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారని.. ప్రతిపక్షాన్ని అణగదొక్కడమే లక్ష్యంగా వైకాపా నేతలు పనిచేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. తెలంగాణ మీదుగా గోదావరి జలాలు శ్రీశైలానికి తీసుకెళ్తామంటున్నారని.. ఈ అంశం ఇద్దరు ముఖ్యమంత్రులకు కాకుండా రెండు రాష్ట్రాలకు చెందిన విషయమని అర్థం చేసుకోవాలని బాబు హితవు పలికారు.

Related posts