telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరోసారి విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ కాంబినేషన్ ?

Vishwak-sen

“వెళ్లిపోమాకే” సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు యంగ్ హీరో విశ్వక్‌సేన్. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ‘ఈ నగరానికి ఏమైంది’, తన సొంత దర్శకత్వంలో ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాల్లో తన ఆటిట్యూడ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇటీవల నాని నిర్మాణంలో వచ్చిన ‘హిట్’ సినిమాతోప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. ఇక త్వరలో విశ్వక్ సేన్ ‘ఓ మై కడవులే’ అనే తమిళ సూపర్ హిట్ సినిమా తెలుగు రీమేక్ లో నటించనున్నాడు. అయితే ఆ సినిమాకి డైలాగ్ రైటర్ గా తరుణ్ భాస్కర్ అయితే బాగుంటుందని హీరో విశ్వక్ సేన్ నిర్మాత పీవీపీకి సూచించారట

Related posts