telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ తెరపైకి ఎలక్ట్రిక్ వాహానాలు.

ఏపీలో మళ్లీ తెరపైకి వచ్చాయి ఎలక్ట్రిక్ వాహానాలు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహానాలను ప్రొత్సహించేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది జగన్ సర్కార్‌. ఈ మేరకు కేంద్రానికి వివిధ ప్రతిపాదనలతో కూడిన నివేదిక పంపింది ఏపీ ప్రభుత్వం. ఇవే విషయాలను నీతి ఆయోగ్‌ దృష్టికీ తీసుకెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో రూ. 30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది ప్రభుత్వం. ఎలక్ట్రానిక్‌ వాహానాలను ప్రొత్సహించేందుకు రాష్ట్రం ముందుకు వస్తే.. 60 వేల మంది ఉపాధి లభిస్తుందంటున్నారు అధికారులు. మరో నాలుగేళ్లల్లో ఏపీలో 10 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు నడిచేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు వేస్తుంది. మరో మూడేళ్లల్లో రాష్ట్రంలో లక్ష ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదన తయారు చేసింది. 2024 నాటికి రాష్ట్రంలోని నాలుగు ప్రధాన నగరాలలో అన్ని ఫాసిల్ ఫ్యూయల్ వాహనాలను తొలగొంచాలని యోచన ఉంది. 2024 నాటికి అన్ని ప్రభుత్వ వాహనాలను ఎలక్ట్రిక్ గా మార్చాలని ప్రతిపాదన తయారు చేయగా… 2029 నాటికి ఏపీఎస్సార్టీసీలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులనే నడిపేలా రంగం సిద్దం చేస్తోంది సర్కార్‌. ప్రస్తుతం ఏపీలో ఎన్ని ఈకో ఫ్రెండ్లీ వాహానాలు ఉన్నాయనే లెక్కలను సిద్దం చేస్తున్నారు అధికారులు. బ్యాటరీ మీద నడిచే టూ వీలర్లు-9001, త్రీ వీలర్లు-971, ఫోర్ వీలర్లు-8208… సీఎన్జీ ఆటోలు-16826, సీఎన్జీ కార్లు-4535, సీఎన్జీ బస్సులు-313 రానున్నాయి. IISER, ISRO, IITల సహకారంతో ఇంజనీరింగ్‌ విభాగాల్లో అడ్వాన్స్‌ రీసెర్చ్‌ను ప్రొత్సహించేలా సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్డ్‌ ఆటోమోటీవ్ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కొత్త ఎలక్ట్రిక్ వాహనాల కోసం టెస్ట్‌ ట్రాక్‌తో కూడిన సెంటర్ ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ స్మార్ట్‌ మెబిలిటీ కేంద్రాన్ని 100 ఎకరాల్లో ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తోంది ఏపీ సర్కార్‌.

Related posts