telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయి: ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

indrakaran reddy minister

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా వెంక‌ట‌పూర్ ప్రాథ‌మికోన్న‌త పాఠ‌శాల‌లో నిర్వ‌హించిన‌ ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాలలో కొత్తగా చేరిన పిల్లలకు మంత్రి అక్షరాభ్యాసం చేయించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ…. తెలంగాణ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు.

కార్పొరేట్‌ చదువులకు దీటైన బోధన కోసం విద్యా రంగానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్‌లోనూ అధిక నిధులను సీఎం కేసీఆర్‌ కేటాయిస్తున్నారని తెలిపారు. ఉన్నతమైన విద్యకావాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులను, బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉంద‌ని ఆయ‌న గుర్తుచేశారు.

Related posts