telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జగన్ సిబిఐకి దత్తపుత్రుడు : వైసీపీ నేతల వ్యాఖ్యలకు పవన్‌ కౌంటర్

జనసేన చేపట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం లో కొనసాగుతోంది. అనంతపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ మీడియాతో  కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకత్వం నాపై వ్యక్తి గత దూషణలు చేస్తున్నారు.. నేను భరిస్తున్నాను. సీబీఎన్ దత్తపుత్రుడు అంటున్నారు.

ఇంకొక్కసారి అంటే మాత్రం జగన్ రెడ్డి గారిని సిబిఐకి దత్తపుత్రుడు అని అనాల్సి వస్తుందని పవన్‌ మండిపడ్డారు.

2019 ఎన్నిక‌ల నుంచి తెలుగుదేశం పార్టీకి బీటీమ్ గా జనసేన పార్టీని వ్యవహరిస్తే వైసీపీని చర్లపల్లి జైలు షటిల్ టీంగా పిలవాల్సి వస్తుంది.” అని పవన్ కల్యాణ్ అన్నారు. మీరు ఆర్థికనేరాలు చేసి జైల్లో కూర్చున్నవాళ్లని, నీతులు చెప్పే హక్కు, స్థాయి వైసీపీ నేతలకు లేదని పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు

వైసీపీ వాళ్ళు స్వతంత్ర సమరయోధులు లాగా మాట్లాడుతారు. నాకు భయం లేదు… దెబ్బ పడేకొద్దీ రాటుతేలుతా. పోలీసు శాఖ పరిస్థితి క్లిష్టంగా ఉంది. సరెండర్ లీవ్, ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వడం లేదు. ప్రభుత్వానికి చెబుతున్నాను.. పోలీసులకి ఇవ్వాల్సినవి ఇవ్వండి అంటూ మండిప‌డ్డారు .

ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకూ జనసేన పోరాడుతుందని స్పష్టం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను గుర్తించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల వంతున ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు.

జనసేన పర్యటనను దృష్టిలో పెట్టుకుని ఆగమేఘాల మీద కౌలు రైతులకు ఏడు లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తుందని పవన్ అన్నారు. తన పర్యటనకు ముందే అందరికీ న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకొని ఉంటే హర్షించే వాళ్లమన్నారు.

ఇవాళ మొదటి విడతలో 30 కుటుంబాలకు ఇచ్చాం. మరో రెండు విడతల్లో మిగిలిన రైతులకు సాయం అందిస్తాం. డబ్బు ఇచ్చి చేతులు దులుపుకోం ..ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇస్తాం. చనిపోయిన కౌలు రైతుల సహాయం కోసం నిధిని ఏర్పాటు చేస్తాం అన్నారు పవన్. రాష్ట్రంలో ఎంతమంది కౌలు రైతులు చనిపోయారన్న జాబితా ప్రభుత్వం వద్ద లేదు జనసేన వద్ద లిస్ట్ ఉం ద‌ని అన్నారు.

ప్రభుత్వం చేత ముక్కు పిండించి మరీ కౌలు రైతు కుటుంబాని కి రూ.7 లక్షలు ఇప్పించేందుకు వత్తిడి తెస్తాం. ప్రతి కుటుంబానికి డబ్భు, కౌలుదారు గుర్తింపు కార్డులు వచ్చే వరకు అండగా ఉంటాం. జన సైనికులు రైతు కుటుంబాలకు అండగా ఉండండి అన్నారు

 

.

Related posts