ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. తుగ్లక్ చర్యలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిన్నదని అన్నారు. జగన్ ఆలోచనలన్నీ నేరపూరితంగా ఉంటున్నాయని విమర్శించారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు.
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని భూములపై సిట్ నివేదికను లీక్ చేయడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని యనమల అన్నారు. వైసీపీ అవినీతిని బయటపెట్టారనే అక్కసుతో జగన్ ఇలాంటి కక్షసాధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు.
కేబినెట్ సబ్ కమిటీలో ఉన్నది జగన్ అనుచరులేనని తెలిపారు. జగన్ ఆలోచనలనే ప్రభుత్వం వేసిన సిట్ చెబుతుందని అన్నారు. ఐదేళ్ల తర్వాత అమరావతి సరిహద్దుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తుండటం కూడా కక్షసాధింపేనని యనమల పేర్కొన్నారు.
విద్యార్థులు వైసీపీ నేతల బూతులు వినాల్సి రావడం బాధాకరం…