telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అంతర్వేది ఘటనపై స్వామీజీలు మాట్లాడొద్దు: మంత్రి వెల్లంపల్లి

vellampalli srinivas ycp

అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మరోసారి స్పందించారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిందని వెల్లడించారు. ఇక అంతర్వేది రథం దగ్ధం ఘటనపై స్వామీజీలు, నాయకులు మాట్లాడవద్దని విజ్ఞప్తి చేవారు.

ఆలయాల్లో రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.రాష్ట్రంలో బీజేపీ మతపరమైన అంశాలను లేవనెత్తుతోందని మంత్రి వెల్లంపల్లి ఆరోపించారు.

2017 రథం దగ్ధం ఘటనపై సోము వీర్రాజు బాధ్యత తీసుకుంటారా? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఫాంహౌస్ లో కూర్చుని నల్లబ్యాడ్జీలు పెట్టుకుంటే సరిపోదని విమర్శించారు. అంతర్వేది ఘటనపై మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు.

Related posts