telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నిరుద్యోగులకు శుభవార్త… ఖాళీల భర్తీపై ఏపీ సర్కార్ ఫోకస్

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై ఏపీ సర్కార్ ఫోకస్ చేసింది. వీలైనంత త్వరగా జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు అధికారుల కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో సమాచారం వివిధ ప్రభుత్వ శాఖలు అందివ్వ లేదు. అయితే.. జాబ్ క్యాలెండర్ ప్రకటన జారీ జాప్యం కావడంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఖాళీల వివరాలు అందివ్వని శాఖల నుంచి తక్షణం సమాచారం తెప్పించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఖాళీల విషయంలో ఇంకా సమాచారం అందివ్వని సుమారు 30 శాఖలకు చెందిన వివిధ విభాగాలు… ఇవాళ సాయంత్రం నాలుగు గంటల లోపల ఖాళీల వివరాలను అందివ్వాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఆదేశించారు. ఖాళీల వివరాలను అందించడాన్ని మోస్ట్ అర్జెంట్ అంశంగా పరిగణించాలని ఏపీ సీఎస్ హెచ్చరించారు.

Related posts