telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

వెయిట్రెస్‌ కు .. టిప్ గా కారు ఇచ్చేసిన కస్టమర్ …

customer given car as tip to waiter

ఏదైనా రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌ సర్వ్ చేస్తే కస్టమర్లు టిప్ ఇవ్వడం సహజం. కొంతమంది కస్టమర్లు వారి సర్వీసు పట్ల హ్యాపీగా ఫీలై తమకు తోచినంత డబ్బును ఇచ్చేస్తుంటారు. కానీ, టెక్సస్‌లోని గెల్వాస్టన్‌లో రెస్టారెంట్‌కు వెళ్లిన కస్టమర్లు వెయిట్రెస్‌ పట్ల దయగుణంతో వ్యవహరించారు. వెయిట్రెస్‌ పరిస్థితిని తెలుసుకుని ఏకంగా ఆమెకు కారునే గిఫ్ట్‌గా ఇచ్చేశారు. దీంతో ఆ వెయిట్రెస్‌ పట్టరాని ఆనందంతో వారికి కృతజ్ఞతలు తెలిపింది. అడ్రియన్నా ఎడ్వర్డ్స్ అనే యువతి డెన్నీలోని అమెరికన్ రెస్టారెంట్ చైన్‌లో వెయిట్రెస్‌గా పనిచేస్తోంది. రెస్టారెంట్‌లో పనిచేసేందుకు ప్రతిరోజు 14మైళ్లు (22.5కిలోమీటర్లు) నడిచి వస్తోంది. రెస్టారెంట్ కు బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు వచ్చిన ఇద్దరు కస్టమర్లకు ఎడ్వర్డ్స్ సర్వ్ చేసింది. ఈ క్రమంలో ఆమె గురించి వివరాలు తెలుసుకున్న వారి హృదయం చలించిపోయింది. అంత దూరం నుంచి ఎలా నడిచి వస్తున్నారంటూ షాక్ అయ్యారు. ‘నాకు చెల్లించాల్సిన బిల్లులు ఉన్నాయని ఓ న్యూస్ వెబ్ సైటుకు ఎడ్వర్డ్స్ తెలిపింది. ‘నేను తినాల్సి వచ్చింది. నువ్వు చేయాల్సిందే చేయాల్సి వచ్చింది’ అని తెలిపింది. ఇకపై ఆమె నడిచి వచ్చి పని చేసే రోజులు నేటితో ముగిసినట్టే.

ఓ రోజు డెన్నీ రెస్టారెంట్ కు బ్రేక్ ఫాస్ట్ తినేందుకు దంపతులిద్దరూ వచ్చారు. ఆ సమయంలో వీరికి ఫుడ్ సర్వ్ చేసిన ఎడ్వర్డ్స్ తన లైఫ్ స్టోరీ గురించి చెప్పింది. తాను రోజు నడిచిరావడానికి చాలా ఇబ్బందిగా ఉంటోందని, అందుకే కారు కొనేందుకు డబ్బులు ఆదా చేస్తున్నానని చెప్పుకొచ్చింది. అది విన్న దంపతుల మనస్సు కరిగిపోయింది. వెయిట్రెస్ యువతికి వెంటనే కొత్త కారు కొని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తమ పేరు చెప్పేందుకు నిరాకరించిన ఆ దంపతులు.. బ్రాడ్ వే వీధిలో ఉన్న క్లాసిక్ గెల్వెస్టన్ ఆటో గ్రూపు దగ్గరకు వెళ్లారు. వెయిట్రెస్ కోసం కొత్త కారు కొనుగోలు చేశారు. కొన్ని గంటల తర్వాత డెన్నీ రెస్టారెంట్ దగ్గరకు వచ్చి దంపతులు.. వెయిట్రెస్ ఎడ్వర్డ్స్‌కు 2011 నిస్సాన్ సెంట్రా కారును గిఫ్ట్ గా ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తారు.

తనకు ఖరీదైన కారును బహుమతిగా ఇవ్వడంతో వెయిట్రెస్ అడ్రియన్నా పట్టరాని సంతోషంతో కన్నీటి బాష్పాలు కార్చేసింది. అప్పటి నుంచి రెస్టారెంటుకు వెయిట్రెస్ నడవడం మానేసింది. కాలినడకన 5 గంటలు పట్టే సమయం కాస్తా.. కారులో 30నిమిషాల్లోనే రెస్టారెంటుకు చేరుకుంటోంది. ఇప్పటికి కారు గిఫ్ట్ ఇవ్వడం కలగానే అనిపిస్తోంది. ఎవరైనా కష్టాల్లో ఉంటే తప్పకుండా వారికి సాయం చేస్తాను. నేను ఎంతమేరకు వారికి సాయం చేయగలనో అంతా ప్రయత్నిస్తానని తెలిపింది. గత ఏడాదిలో అల్బామా అనే వ్యక్తి తన ఆఫీసుకు వెళ్లేందుకు ప్రతిరోజు 32 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేవాడు. తొలి రోజే సరైన సమయానికి ఆఫీసు చేరుకోవడం గమనించిన అతడి బాస్.. వెంటనే అతడికి గిఫ్ట్ గా కారు కొనిచ్చాడు.

Related posts