telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

యాంకర్ ప్రదీప్ సినిమా విడుదల పై అనుమానాలు…

30

తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ గా ప్రదీప్ మాచిరాజు మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే తెలుగు బుల్లితెరలో ఉన్న మేల్ యాంకర్లలో ఇతడి స్థాయే వేరు. యాంకర్‌గా ఉంటూ భారీ ఫాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. అతడి యాంకరింగ్ చూడటానికే కొందరు షోలు కూడా చూస్తారనడం అతిశయోక్తేమీ కాదు. అయితే మొట్టమొదటి సారి బుల్లితెర హీరో వెండి తెర పైకి వచ్చేందుకు ప్రయత్నించాడు. ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అని కుర్రకారుకి ప్రేమ పాటాలు చెప్పాలని ముచ్చటపడ్డాడు. కానీ కరోనా వచ్చి మొత్తం స్కూల్‌కే తాళం వేసింది. ప్రదీప్ హీరోగా తెరకెక్కిన చిత్రం ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ సినిమాలో ప్రదీప్ సరసన యంగ్ బ్యూటీ అమృత అయ్యర్ నటించింది. అంతేకాకుండా ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు మున్నా దర్శకత్వం వహించాడు. ప్రదీప్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులను దృష్టిలో పెట్టుకొని గీతా ఆర్ట్స్2, మూవీ క్రియేషన్స్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఓకే చెప్పాయి. అంతేకాకుండా మొదటగా విడుదలయిన ఫస్ట లుక్‌తో పాటు విడుదలయిన నీలీ నీలీ ఆకాశం పాట కూడా సోషల్ మీడియాను ఉర్రూతలూగించాయి. అయితే ఈ సినిమాను 2020 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందు తీసుకురావాలని అనుకున్నారు. కానీ కరోనా రాకతో అదికాస్తా వాయిదా పడింది. ఇన్నాళ్లు థియేటర్స్‌ కోసం ఎదురు చూసిన వీరు సంక్రాంతి బరిలోకి ఈ సినిమాను దించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలు ఉండటంతో ఈ సినిమాకి సంక్రాంతి స్లాట్ కూడా దొరకడం కష్టమేనని అంటున్నారు. చూడాలి మరి ఏం చేస్తారు అనేది.

Related posts