telugu navyamedia
రాజకీయ సినిమా వార్తలు

రాహుల్ గాంధీతో కరీనా కపూర్ డేట్ !?

Kareena Kapoor,Rahul Gandhi
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ హీరో సైఫ్ అలీఖాన్ ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు తైమూర్ అనే ఒక కొడుకు కూడా ఉన్నాడు. తైమూర్ అప్పుడే బాలీవుడ్ సెలెబ్రిటీ స్థానం దక్కించుకున్నాడు. ఎందుకంటే తైమూర్ ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతలా పాపులర్ అవుతాయంటే… షేర్ చేసిన వెంటనే లక్షల్లో లైకులు, షేర్లు వచ్చి పడతాయి. ఈ విషయం పక్కన పెడితే… కరీనా కపూర్ పెళ్ళి తరువాత కూడా సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా సిమీ గ‌రేవాల్ నిర్వాహించిన ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది క‌రీనా. ఈ ఇంటర్వ్యూలో త‌న గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విషయాలను వెల్ల‌డించింది.
ఇంటర్వ్యూలో భాగంగా “మీరు ఎవరితో డేటింగ్ కు వెళ్లాలనుకుంటున్నారు?” అనే ప్రశ్న ఎదురైంది కరీనాకు. దానికి ఆమె “రాహుల్ గాంధీ” అంటూ ఠక్కున సమాధానం చెప్పింది. అంతేకాదు “మీరు అడిగిన ప్ర‌శ్న‌కు ఈ స‌మాధానం చెప్పొచ్చో, చెప్ప‌కూడ‌దో తెలియదు. నా సమాధానం వివాదాస్పదం కావొచ్చు. అయినప్పటికీ నా మనసులో ఉన్న మాట చెబుతాను. నేను రాహుల్ గాంధీతో డేట్‌కు వెళ్లాల‌నుకుంటున్నాను. మేగ‌జైన్‌లో అత‌ని ఫోటోలు చూస్తున్న‌ప్పుడు అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలని అన్పిస్తుంది. నేను పూర్తిగా సినిమాలకు అంకిత‌మైనసంబంధించిన కుటుంబం నుంచి వ‌చ్చాను. అయ‌న పూర్తిగా రాజ‌కీయ కుటుంబానికి చెందిన వ్య‌క్తి. కాబట్టి మా ఇద్దరి మ‌ధ్య జ‌రిగే చ‌ర్చ ఆస‌క్తిక‌రంగా ఉంటుందేమో” అంటూ తన సమాధానానికి వివరణ కూడా ఇచ్చుకుంది కరీనా. 

Related posts