వైసీపీ ప్లీనరీ సమావేశాలు ముగిశాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో శుక్ర, శని వారాల్లో వైసీపీ ప్లీనరీ నిర్వహించారు. రెండు రోజుల పాటు సాగిన ప్లీనరీలో.. పలు తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు.
మొదటిరోజు పార్టీ గౌరవ అధ్యక్ష పదివి నుంచి తప్పుకుంటున్నట్టుగా వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మి ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్లీనరీలో పార్టీ రాజ్యాంగానికి సవరణలు కూడా చేశారు.
పార్టీ అధ్యక్ష పదవిని.. జీవితకాల అధ్యక్ష పదవిగా మార్చారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా ఉన్న పేరును.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గా మార్చుతూ సవరణ చేశారు. వైఎస్ జగన్‌ను పార్టీ జీవితాకాల అధ్యక్షుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటన చేశారు.