telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రైవేటీకరణ పై చిరు ఎమ్మనడంటే…?

Chiranjeevi

ఏపీలో ప్రస్తుతం ఎన్నికల వేడి ఎంత ఉందొ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వేడి కూడా అంతే ఉంది. అయితే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి చిరంజీవి మద్దతు ప్రకటించారు. కాలేజీ రోజుల్లోనే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నానని నాటి రోజులను ఆయన గుర్తు చేశారు. కాలేజీలో చదువుకునే సమయంలో విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని బ్రష్‌తో రాశానని చెప్పారు. నష్టాల పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామనడం దారుణం అని చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతాలు, పార్టీలకతీతంగా అందరూ పోరాడాలని చిరంజీవి పిలుపునిచ్చారు.  లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని కోరుతున్నాను. ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తును, ప్రజల మనోభావాల గుర్తించి కేంద్రం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి. ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కును కాపాడుకుందాం’ అంటూ చిరంజీవి పిలుపునిచ్చారు. అయితే ఈ ఉద్యమానికి రోజురోజుకు మద్దతు పెరుగుతున్న విషయం తెలిసిందే.

Related posts