బాలీవుడ్ నటి సన్నీలియోన్ లైంగిక వేధింపులపై స్పందించింది. ఇండస్ట్రీలో వేధింపులు అనేవి చాలా కామన్ అనీ, ఆ మాటలకు వస్తే ఆడవారు మాత్రమే కాకుండా మగవారు కూడా లైంగికంగా వేధింపులను ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చింది. కాని మగవారు లైంగిక వేధింపులను లైట్ తీసుకుంటున్నారని.. వారు అవకాశాల కోసం సైలెంట్‌గా ఉంటున్నారంటోంది. లైంగిక వేధింపులను ఆడ అయినా, మగ అయినా ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఎదుర్కోవాలని ఆడవారు మాత్రమే కాకుండా మగవారు కూడా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై గళం ఎత్తాలంటూ పిలుపునిచ్చింది. ఉన్నట్లుండి సన్నీలియోన్ మగవారి పక్షాణ నిలబడి మగవారు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులకు పరిష్కారం మీటూ అంటూ మాట్లాడటం అందరికి ఆశ్చర్యంగా ఉంది.
previous post
టీడీపీ నుంచి వచ్చిన వాళ్లు బీజేపీ భావజాలంతోనే పనిచేయాలి: జీవీఎల్