telugu navyamedia
రాజకీయ వార్తలు

మహారాష్ట్రలో ఆపరేషన్ కమలం లేదు: ఫడ్నవిస్

Fednavis devendra

మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య విభేదాలు ఉన్నాయని మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర పడ్నవిస్ తెలిపారు. ఈ విభేదాలతోనే సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఫడ్నవిస్ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రలో ఆపరేషన్ కమలం లేదని అన్నారు.

అమిత్ షాతో జరిగిన భేటీ రాజకీయపరమైనది కాదని చెప్పారు. మహారాష్ట్రలో షుగర్ ఇండస్ట్రీని ఆర్థికంగా ఆదుకోవాలని కోరడానికి అమిత్ షాను కలిశానని తెలిపారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తమకు లేదన్నారు. కరోనాపై పోరాటమే ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యమని చెప్పారు. మహారాష్ట్రలో కరోనా పరిస్థితిని అమిత్ షాకు వివరించానని తెలిపారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే క్రమంలోనే అమిత్ షా తో భేటీ అయ్యారనే వార్తలను ఆయన ఖండించారు.

Related posts