telugu navyamedia
రాజకీయ

దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సీనేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేశాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.

దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 31,382 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 318 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 32,542 మంది బాధితులు కోలుకున్నారు.

దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,35,94,803 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 3,00,162 మందికి చికిత్స కొనసాగుతున్నది. కరోనా నుండి ఇప్పటి వరకు 3,28,48,273 మంది బాధితులు కోలుకున్నారు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 4,46,368 మంది మృతి చెందారు.

దేశవ్యాప్తంగా రికవరీ రేటు 97.78%, మరణాల రేటు 1.33%గా ఉంది. ఇప్పటివరకు 84,15,18,026 మందికి కరోనా టీకాలు అందజేశారు.

కాగా, ఒక్క రోజులో దేశ వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే నమోదు అయ్యాయి. కేరళలలో 19,682 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 152 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రాష్ట్రంలో రోజూ కనీసం 15 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతుండటం  కాస్తా కలవరానికి గురి చేస్తోంది.

Related posts