టీడీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. నేరాలను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతలు రాష్ట్రపతిని కలిశారంటూ ఆరోపించారు.
టీడీపీ నేతలు కేసుల నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. బాబుకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై విశ్వాసంలేదనిదుయ్యబట్టారు. బాబు పీఎస్ ఇంట్లో సోదాల తర్వాత రూ.2 వేల కోట్ల లావాదేవీలకు ఆధారాలు బయటపడ్డాయని ఆయన అన్నారు.