తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విరుచుకుపడ్డారు. రైతులను మోసం చేసి కేసీఆర్ ఎన్నికల్లో గెలిచారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు రైతుల ఉసురు తగులుతుందని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో మూడు లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. ప్రాణాలైనా అర్పించి యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
టీఆర్‌ఎస్‌లో ముసలం పుట్టిందని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు.
గులాబీ బాస్ కేసీఆర్ తీరును ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పి పార్టీ సీనియర్ నేత నాయిని నర్సింహరెడ్డిలాంటి వారినే మోసం చేశాడంటే ప్రజల పరిస్థితి ఏంటో అర్థమవుతుందని స్పష్టం చేశారు. అధినేత తీరును వ్యతిరేకిస్తున్నవారిని తెలంగాణ భవన్‌కు పిలిచి కాళ్లు పట్టుకుని పార్టీలో ఉంచుతున్నారని ఎంపీ కోమటిరెడ్డి దుయ్యబట్టారు.