ఆర్టికల్ 370ని భారత్ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత ఆ అంశాన్ని వివాదాస్పదం చేసేందుకు పాకిస్థాన్ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్లను పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో వాడుకుంది. దీంతో రాహుల్ గాంధీ కశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాయి. కాంగ్రెస్, రాహుల్ ట్విట్లను పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితిలో తనకు అనుకూలంగా మార్చుకుంది. కశ్మీర్ అంశం ముమ్మాటికి భారత్ అంతర్గత విషయమంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఈ విషయంలో పాక్ సహా ఏ దేశం జోక్యం చేసుకునే అవసరం లేదని ఆయన తన ట్విట్లో పేర్కొన్నారు.
ప్రభుత్వంతో చాలా విషయాల్లో తమకు విబేధాలు ఉన్నప్పటికీ కశ్మీర్ విషయంలో మాత్రం ఎన్డీయే సర్కార్ నిర్ణయానికే తమ మద్దతు ఉంటుందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. పాక్ మద్దతు వల్లే జమ్మూకశ్మీర్‌లో హింస చెలరేగుతోందని రాహుల్ ట్వీట్ చేశారు. రాహుల్ ట్విటర్లో చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితికి పంపిన నివేదికలో ప్రస్తావించింది. జమ్మూ కశ్మీర్ లోని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాల పేర్లను కూడా లేఖలో ఇరికించింది.
పృథ్వీ షా పై పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు…