telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

కొణతాల రామకృష్ణ .. టీడీపీ లోకి.. !!

konitala ramakrishna into tdp

గత కొంత కాలంగా తటస్థంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కొణతాల రామకృష్ణ, తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 17న ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో కొణతాల పచ్చ కండువాను కప్పుకోనున్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఆయనకు అనకాపల్లి లోక్ సభ టికెట్ ను కూడా ఇచ్చేందుకు చంద్రబాబు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలుస్తోంది.

ఇప్పటికే అనకాపల్లి నుంచి పోటీకి విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి తులసీరావు కుమారుడు ఆడారి ఆనంద్‌ అయ్యన్న కుమారుడు విజయ్ ఆసక్తి చూపుతున్నా కూడా, కొణతాలకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ, ఎంతోమంది నేతలు పార్టలు ఫిరాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు తమ పార్టీలను వదిలి పక్క పార్టీల్లో అవకాశాల కోసం పరుగులు పెట్టగా, అదే దారిలో మరింత మంది ఉన్నారని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Related posts