బంగారం, వెండి ధరలు జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతున్నాయి. మొన్నటి వరకూ కాస్త నెమ్మదించినట్లే కనిపించిన పుత్తడి ధరలు ఇప్పుడు ఆకాశానికి అంటుతున్నాయి.
ధరలు ఇదే స్థాయిలో పెరిగితే సామాన్యులు బంగారం, వెండి కొనుగోలు చేయడం అసాధ్యం. ప్రజలు తమ పొదుపు మొత్తాన్ని బంగారం మరియు వెండికి కేటాయించరు.
పొదుపు లేదా పెట్టుబడి పెట్టాలనుకున్న వారు మాత్రమే బంగారాన్ని, వెండిని కొనుగోలు చేస్తారు. . అంతే తప్పించి బంగారాన్ని కొనుగోలు చేయాలంటే గగనంగామ మారపోతుంది.
కొనుగోళ్లు మాత్రం..
ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు ఆగవనే ధైర్యం కావచ్చు.. వాటి పరుగును ఆపడం ఎవరికీ సాధ్యం కావడం లేదు.
పెళ్లిళ్ల సీజన్ కాకపోయినా సరే బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడం అంటే ఇక భవిష్యత్ లో ఎంత మేర పెరుగుతాయో ఊహించుకుంటేనే భయమేస్తుంది. ఇప్పటికే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 75 వేల రూపాయలకు దరిదాపులకు చేరుకుంది.
అలాగే కిలో వెండి ధర కూడా లక్షకు చేరువగా ఉంది. ఇక ధరలు పెరగడానికి అనేక కారణాలు చెబుతున్నప్పటికీ కొనుగోళ్లు ఏ మాత్రం జరుగుతాయన్నది మాత్రం చూడాల్సిందే.
ధరలు ఇలా..
ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ పోతున్నాయి. ఇలాగే పెరుగుతూ వెళుతుంటే బంగారం సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుంది.
మధ్యతరగతి ప్రజలకు కూడా భారంగా మారనుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 67,860 రూపాయలుగా కొనసాగుతుంది.
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74,030 రూపాయలుగా నమోదయింది. కిలో వెండి ధర 92,600 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.
ఎంపీ ధర్మపురి అరవింద్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జనసేన