telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెరాస, ఎంఐఎంలపై విమర్శలు గుప్పించిన భట్టి…

Bhatti-Vikramarka clp

గ్రేటర్ ఎన్నికల సందర్బంగా పార్టీలు ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. చివరి రోజున కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తోంది.  ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బీజేపీ, తెరాస, ఎంఐఎంలపై విమర్శలు గుప్పించింది.  బీజేపీకి ఇక్కడ పార్టీ లేదని అందుకే బయటి నుంచి నాయకులను తెప్పించుకొని ప్రచారం చేయించుకుంటున్నారని అన్నారు.  సీఎం కేసీఆర్ పై గ్రేటర్ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి సభ పెట్టి చల్లార్చాలని అనుకుంటున్నారని తెలిపారు.  మతం పేరుతో ఓటు బ్యాంకు పొందాలని పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు.  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తెరాస పార్టీ కొనుగోలు చేసిందని, తెరాస పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొంటుందేమో అని అన్నారు.  కేసీఆర్ మొదలుపెట్టిన ఆటను బీజేపీ కంటిన్యూ చేస్తుందేమో అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.  తెరాస, బీజేపీ, ఎంఐఎంలు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, అందుకే సమస్యలపై మాట్లాడకుండా మతం గురించి బీజేపీ మాట్లాడుతోందని, అటు తెరాస, ఎంఐఎం లు కూడా సమస్యల గురించి పట్టించుకోవడం లేదని అన్నారు.  గ్రేటర్ ప్రజలు అలోచించి ఓటు వేయాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Related posts