telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

లాక్ డౌన్ పొడగింపు : సిఎం కెసిఆర్ కు తెలుగులో ట్వీట్ చేసిన ఒవైసీ

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ తెలంగాణ క్యాబినెట్ సమావేశం అవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓ విజ్ఞప్తి చేశారు. అందులో తెలుగులో ట్వీట్ చేయడం గమనార్హం. లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ మంత్రివర్గం ఇవాళ సమావేశమవుతోందని… లాక్ డౌన్ పై తన వ్యతిరేకతను మరోమారు స్పష్టం చేస్తున్నానని పేర్కొన్నారు. కోవిడ్ 19 ను ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదు…దీంతో పేదల జీవితాలు నాశనమవుతాయని తెలిపారు. మహమ్మారికి ధీర్ఘకాలిక పరిష్కారం వ్యాక్సినేషన్ మాత్రమేనని…లాక్ డౌన్ వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. మహమ్మారి,పేదరికం,పోలీసుల వేధింపులతో చాలా ఇక్కట్లలో పడతారని… ప్రజారోగ్య సంక్షోభాన్ని ప్రభుత్వాలు శాంతి, భద్రతల సమస్యగా మారుస్తున్నాయని వెల్లడించారు. ఇది ఎంత మాత్రం శాస్త్రీయ, మానవతా ధృక్పథం కాదని… లాక్ డౌన్ పొడిగించవద్దని సిఎం కెసిఆర్ ను గట్టిగా కోరుతున్నానని పేర్కొన్నారు. జనసమ్మర్దాన్ని తగ్గించాలనుకుంటే సాయంత్రం ఆరు గంటల నుంచి కర్ఫ్యూ విధించాలి లేదా కోవిడ్ క్లస్టర్లలో మినీ లాక్ డౌన్ విధించాలి… కానీ, కేవలం 4 గంటల సడలింపులతోనే 3.5 కోట్ల మంది జీవనం వారాల పాటు కొనసాగించాలని భావించడం తగదని తెలిపారు.

Related posts