telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

కొత్త గెటప్‌లో కనిపించనున్న రియల్‌ హీరో సోనూ..

Sonu-Sood

సోనూ సూద్ కరోనా కాలంలో ఎందరో వలస కూలీలకు తనవంతు సహాయం చేశాడు. వారి కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి మరీ వారికి ఇళ్ళకు చేర్చాడు. అంతేకాకుండా ఇతర దేశాలలో ఉన్నా వారికోసం ప్రత్యే ఫ్లైట్లను కూడా పెట్టించాడు. దాంతో దేశంలో రియల్ హీరోగా పేరు పొందాడు. అంతేకాకుండా కరోనా కారణంగా నిరుద్యోగులైన వారికి ఎందరికో ఉద్యోగ అవకాశాలు ఇప్పించాడు. అయితే ఇటీవల సోనూ సూద్ తన పేరు మీద మరో రికార్డును రాశాడు. ఓ ప్రముఖ యూకే సంస్థ చేసిన సర్వేలో ఈ రియల్ హీరో పేరు కూడా ఉంది. ఆసియాలోని ప్రముఖ తారల సరసన సోనే నిలుచున్నాడు. ఇది ఇలా ఉండగా… సోనూసూద్‌ మరో కీలక ప్రకటన చేశాడు. తాను త్వరలోనే సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టనున్నట్లు పేర్కొన్నాడు సోనూ. “నేనే నిర్మాతగా మారబోతున్నా. చర్చలు చివరి దశలో ఉన్నాయి. ప్రజల్లో స్ఫూర్తి నింపే కథలు, నేను చేయాలనుకున్న స్క్రిఫ్ట్స్ కోసం చూస్తున్నా. అన్నీ కుదిరితే నటుడిగా, నిర్మాతగా మీ ముందుకొస్తా” అని స్వయంగా సోనూ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

Related posts