telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తమిళ సినిమాకు దూరంగా సమంత… తల్లి కాబోతున్నందుకేనా…?

Samantha-and-Naga-Chaitanya

సమంత, నయనతార కలిసి ఓ తమిళ సినిమాలో నటించాల్సి ఉంది. ఈ విషయాన్ని సమంతనే ప్రకటించారు. నయనతార కూడా నటించనున్నారు. అయితే సమంత ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం ఆమె తల్లి కాబోతుండడమే అని కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే దీనిపై సమంత ఏమంటారో వేచి చూడాలి. గతంలో కూడా గర్భం దాల్చారంటూ వచ్చిన వార్తలపై సమంత గట్టిగానే స్పందించారు. ఫ్యాన్స్ పోరు పడలేక 2021లో ఆగస్ట్‌లో బిడ్డను కనబోతున్నానని అన్నారు. అయితే నిజంగా అన్నారా జోక్‌గా అన్నారా అన్నది ఆమెకే తెలియాలి. తన బాల్యంలో చాలా కష్టాలు పడ్డానని చెప్పారు. తాను పొందలేనివన్నీ తన బిడ్డకు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని సమంత తెలిపారు. ఇకపోతే సమంత నటించాల్సిన సినిమాలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించనున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తారు. ఏప్రిల్‌ నుంచి షూటింగ్ మొదలుకావాల్సి ఉంది. మరి ఇప్పుడు వస్తున్న వార్తలపై ఆమె ఏ రకంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Related posts