telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మొహానికి మాస్క్ వేసుకుని సూపర్ మార్కెట్ లో బన్నీ

bunny

దేశంలో మొత్తం లాక్ డౌన్ ప్రకటించినా.. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నిత్యావసర వస్తువులు, మెడిసిన్స్ కోసం ఆయా ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చాయి. ఈ క్రమంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన ఇంటికి సరుకులు కొనడానికి జూబ్లిహిల్స్ లోని రత్నదీప్ సూపర్ మార్కెట్ లో ప్రత్యక్షమయ్యారు. మొహానికి మాస్క్ వేసుకుని షార్ట్, టీ షర్ట్ తో ఉన్న బన్నీని కొందరు గుర్తుపట్టి ఫోటోలు తీశారు. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే బన్నీ తన వెంట బాడీగార్డ్ ఎవరిని కూడా తీసుకురాలేదు. కాగా, కరోనా సెలబ్రిటీలు, సామాన్యులు ఒకటే అని చెప్పేసింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Related posts