telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అవకాశం పేరుతో మోసపోయాను… రూ. 10 లక్షలు డిమాండ్… : నిఖిల్

Manchu

శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయ్యాడు యంగ్ హీరో నిఖిల్. ఆ సినిమా తరువాత ఆయనకు వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ అందులో చాలా సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. స్వామిరారా చిత్రంతో మళ్ళీ నిఖిల్ హిట్ సాధించారు. కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. కాగా ఇటీవల ఆయన నటించిన ‘కిర్రాక్ పార్టీ’ విడుదలై బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా అలరించలేదు. అది అలా ఉంటే తాజాగా నిఖిల్ మంచు లక్ష్మి హోస్ట్‌గా వ్యహరిస్తున్న ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ అనే రియాలిటీ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చేదు అనుభవాలకు ఎదుర్కున్నాని.. కొన్ని సినిమాల్లో వేశాలు ఇస్తామని చెప్పి కొంతమంది మోసం చేశానన్నారు. ఒక్కో పాత్ర కోసం రూ.5లక్షల నుండి రూ.10లక్షల వరకు డిమాండ్ చేశారని చెప్పాడు. అయితే డబ్బులు నా దగ్గర లేకపోవడంతో మా నాన్న దగ్గర అడిగి వారికి చెల్లించానని తెలిపాడు. అది అలా ఉంటే నిఖిల్ హీరోగా నటించిన ‘అర్జున్ సురవరం’ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సీ ఉండగా కొన్ని కారణాల వల్ల ఇప్పటికీ విడుదల కాలేదు. నిఖిల్‌కు జంటగా ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి నటించింది. కాగా ప్రస్తుతం నిఖిల్.. తన ఫ్రెండ్ చందూ మొండేటితో కలిసి మరో ఓ సినిమా చేయనున్నారని సమాచారం. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇంతకు ముందు ‘కార్తికేయ’ వచ్చిన సంగతి తెలిసిందే.

Related posts