telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాయ్‌ఫ్రెండ్‌తో రచ్చ చేసిన శృతి హాసన్..

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్ కు దూసుకెళ్లింది శృతి హాసన్. ఆ తరువాత రెండేళ్లు ప్రేమ కారణంగా సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇటీవలే ఆమె లవ్ బ్రేకప్ కావడంతో మళ్ళీ సినిమాలపై దృష్టి సారించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు త‌మిళం, హిందీలో ఒక్కో సినిమా చేస్తున్నారు. అలాగే తెలుగులో తాజాగా ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబోలో వచ్చిన క్రాక్‌ చిత్రంలో కూడా హీరోయిన్‌గా శ్రుతి నటించింది. ఈ సినిమా బంపర్‌ హిట్‌ కావడంతో సలార్‌ లో కూడా ఛాన్స్‌ కొట్టేసింది. ఇది ఇలా ఉండగా శృతి హాసన్ ఈ లాక్ డౌన్ ను ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. ప్రముఖ ఆర్టిస్ట్ శాంతను హాజరికతో కలిసి ఉన్న పిక్స్ ను షేర్ చేసింది శృతి. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా ప్రకటించకపోయినా… వారు షేర్ చేసే ఫోటోలు చూసి జనాలు అలా ఫిక్స్ అయిపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శాంతను మాట్లాడుతూ వృత్తిపరంగా తాము మంచి స్నేహితులమని, చాలా అభిప్రాయాలు కలిశాయని చెప్పుకొచ్చాడు. అయితే వ్యక్తిగత విషయాలు చర్చించాలనుకోవట్లేదు అంటూ ప్రేమ ప్రశ్నలపై సమాధానాన్ని దాటవేశారు. అప్పటి నుంచి వీరిద్దరూ లవ్ లో ఉన్నారనే అనుకుంటున్నారు. ఇక విషయానికొస్తే… తాజాగా శాంతనుతో కలిసి శృతి షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. నా బెస్టీతో లాక్డౌన్‌లో ఇలా… అంటూ ఈ పిక్స్ ను షేర్ చేసింది శృతి.  

Related posts