telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గుర్రపు స్వారీ చేస్తున్న అక్కినేని హీరో

అఖిల్ అక్కినేని అందరికి సుపరిచితమైన పేరు. తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అంతగా ప్రేక్షకులను మెప్పించలేక పోయాడు. అఖిల్ తనదైన నటనతో కొందరిని ఆకట్టుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలకు పోటీ ఇస్తూ నిలబడేందుకు అనేక విదాల కష్ట పడుతున్నాడు. 2014లో మనం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ తరువాత అఖిల్ సినిమాతో ప్రయత్నించినా అది ప్లాప్ అయ్యింది. అయితే ఇటీవల అఖిల్ మరో సినిమాను రూపొందిస్తున్నాడు. పూజా హిగ్దే హీరోయిన్‌గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను విడుదలకు సిద్దం చేస్తున్నారు. ఈ సినిమాకు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీ సుందర్ సంగీతం ఇస్తుండగా ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరీలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే తన కొత్త సినిమా జోరులో ఉన్న అఖిల్ నేడు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియో పోస్ట్‌ను షేర్ చేశాడు. అందులో అఖిల్ గుర్రంపై స్వారీ చేస్తున్నాడు. ఆ వీడియోకు రోజు మొదలు చేయడానికి సరైన దారి, మార్నింగ్ రష్ అంటూ కాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు ఏ సినిమా కోసమా ఆలోచనలో పడ్డారు. మరి ఈ విన్యాసాల ప్రదర్శన నేర్చుకోవడం ఎందకో అతడే చెప్పాలి.

Related posts