telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అజ‌య్ దేవ‌గ‌ణ్ దర్శకత్వంలో అమితాబ్

AA

న‌టుడిగా, నిర్మాత‌గా అల‌రించిన బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా మారేందుకు సిద్ధ‌మ‌య్యారు. అమితాబ్ బ‌చ్చన్ ప్ర‌ధాన పాత్ర‌లో ‘మేడే’ అనే సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు. థ్రిల్ల‌ర్ మూవీగా రూపొంద‌నున్న ఈ సినిమాకి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌ణ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుండ‌గా, మిగ‌తా కాస్ట్ వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు . హైద‌రాబాద్‌లో ఈ చిత్రం తొలి షెడ్యూల్ జ‌రుపుకోనుంది. బాలీవుడ్ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ డిసెంబ‌ర్ లో చిత్ర షూటింగ్ ప్రారంభం కానున్న‌ట్టు తెలియ‌జేశారు. కాగా, అమితాబ్, అజయ్ దేవ‌గ‌ణ్‌లు గ‌తంలో ఆగ్‌, స‌త్యాగ్ర‌హ‌, ఖాకీ, తీన్ ప‌ట్టి , మేజ‌ర్ సాబ్ అనే చిత్రాల‌లో నటించారు. కాగా ఈ అఫిషియల్ ప్రకటనతో బాలీవుడ్‌లో మ‌రో క్రేజీ కాంబినేష‌న్ కుదిరిందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Related posts