telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పెద్దనోటు .. కనిపించడంలేదు.. ఇక ముద్రణ కూడా లేనట్టేనట..

2000 note printing stopped

ఇటీవల ఎక్కడ చూద్దామన్నా రూ.2వేల నోట్లు చాలా కరువయ్యాయి. ఏటీఎంల నుంచి కూడా రూ. 2వేల నోట్లు రావడం లేదు. అయితే మీకో షాకింగ్ విషయం తెలుసా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు ఒక్క రూ.2వేల నోటు కూడా ముద్రణ కాలేదట. ఈ విషయం ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం) ద్వారా తెలిసింది. ఇటీవల కాలంలో రూ.2వేల నోట్లు ఎన్ని ముద్రణ అయ్యాయంటూ ఓ దినపత్రిక కోరిన ప్రశ్నకు సమాధానంగా ఆర్టీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. బ్లాక్ మనీకి బ్రేక్ వేసేందుకు రూ.2వేల నోట్ల ప్రింటింగ్‌ను ఆర్బీఐ నిలిపివేసినట్లు ఆ శాఖ వెల్లడించింది.

దీనిపై ప్రముఖ ఎకనమిస్ట్ నితిన్ దేశాయ్ మాట్లాడుతూ.. పెద్ద నోట్లను ఆపడం వలన బ్లాక్‌మనీ లావాదేవీలకు ఇబ్బంది కలుగుతుంది. కానీ నోట్ల రద్దుతో పోలీస్తే ఈ చర్య ఒక రకంగా చాలా మంచిదే. చాలా యూరోపియన్ దేశాల్లో నల్లధనానికి బ్రేక్ వేసేందుకు ఇలా పెద్ద నోట్లను అప్పుడప్పుడు రద్దు చేస్తుంటారని పేర్కొన్నారు. 2016 నవంబర్‌లో మోదీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను ఉన్నట్లుండి రద్దు చేసి.. ఆ తరువాత రూ.2వేల నోటును సృష్టించిన విషయం తెలిసిందే. ఆర్టీఐ వివరాల ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ రూ.2వేల నోట్లను ప్రింట్ చేశారు. ఇక 2017-18లో ఈ సంఖ్య కాస్త తగ్గి.. 111.507మిలియన్‌కు చేరింది. ఆ తరువాత 2018-19లో 46.690మిలియన్ రూ.2వేల నోట్ల ముద్రణ మాత్రమే జరిగింది. దీని బట్టి చూస్తుంటే.. భవిష్యత్‌లో రూ.2వేల నోట్లు కనిపించవని సుస్ఫష్టంగా అర్థమవుతోంది.

Related posts