telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బన్నీ, ఎన్టీఆర్ అయితే ఇంకా బాగా చేసేవారు : విజయ్ దేవరకొండ

Vijay-Devarakonda

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు ‘హీరో’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. హీరో సినిమా ఆగిపోయిందనుకున్నారు కానీ ఇటీవల మళ్లీ షూటింగ్ మొదలుపెట్టారు. రౌడీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా, కేథరీన్, ఇజబెల్, ఐశ్వర్యా రాజేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. విజయ్ చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఉంది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో కలిసి విజయ్ ‘బాక్సర్’ అనే స్పోర్ట్స్ బేస్డ్ సినిమా చేయబోతున్నారు. ఇప్పుడు నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ సినిమాకు సంబంధించిన ‘నువ్వే హీరో’ అనే ప్రమోషనల్ వీడియోను ఇటీవల విడుదల చేశారు. ఈ వీడియో సాంగ్‌కు సంబంధించిన విజయ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. ఈ వీడియో మొత్తాన్ని ఓ రైల్వే స్టేషన్‌లో షూట్ చేశారు. విజయ్ వేసుకున్న దుస్తులు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఈ వీడియో కోసం విజయ్‌కు డ్యాన్స్ సరిగ్గా రావాలని కొరియోగ్రాఫర్ చాలా కష్టపడ్డాడట. ఇంతటి కష్టమైన స్టెప్పులు తన వల్ల కావని, తారక్ అల్లు అర్జున్ అయితే ఇరగదీసుండేవారని చెప్పాడు. తాను మాత్రం ఈ వీడియోలో డ్యాన్స్ చేయడానికి చాలా కష్టపడ్డానని తెలిపాడు. ఇందులో ప్రముఖ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయనతో పాటు అభినవ్ గోమతం, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షమీర్ సుల్తాన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts