telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్‌ఎస్‌, బీజేపీలు రెండు ఒక్కటే… వాళ్లు పాలు…నీళ్ల లాంటోళ్లు

revanthreddy campaign in huzurnagar

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్ టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వరదల పేరుతో మున్సిపల్ ఎన్నికల కోసం… 500 కోట్లను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెచ్చి పంచుతుందని ఫైర్‌ అయ్యారు. అందులో 250 కోట్లు టీఆర్‌ఎస్‌ నాయకులే దిగమింగారని ఆరోపించారు. నిజమైన లబ్ధిదారుల జాబితా ఇస్తే….వారికి ఇవ్వకుండా అవినీతి చేసారని పేర్కొన్నారు. జరిగిన అక్రమాలు ప్రభుత్వానికి తెలియకుంటే చర్యలకు దిగేది కానీ సర్కారుకు తెలిసే అన్నీ జరిగాయన్నారు. బీజేపీ సన్నాయి నొక్కులు నొక్కుతుందని… వరద సాయం పంపిణీలో అవినీతి పై చర్య తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేయడం విడ్డురంగా ఉందని మండిపడ్డారు. 500 కోట్ల నగదు డ్రా చేస్తే… పట్టుకోవాల్సింది కేంద్రం కాదా..? … కేంద్ర హోంమంత్రి సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. అవినీతి జరిగితే జైల్లో పెట్టాల్సిన కిషన్ రెడ్డి బుకాయింపు మాటలు మాట్లాడుతున్నారని… మీ పరిధిలో ఉన్న శాఖల తో విచారణ జరిపించండని డిమాండ్‌ చేశారు. బీజేపీ..టీఆర్‌ఎస్‌ అనుబంధము పాలు..నీళ్ల లాంటివన్నారు. చీకట్లో దోస్తానా… ఉదయం ఖయ్యం నడుస్తుందని… రాష్ట్ర ప్రభుత్వం రద్దు అయ్యాక… బీజేపీ నాయకులు వెళ్లి కేసీఆర్ ని కలవలేదా..? అని ఫైర్‌ అయ్యారు. కిషన్ రెడ్డి… వరదల్లో పర్యటిస్తే ఎంఆర్ఓ కూడా రాకుంటే బతిమిలాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని… మీ అధికారానికి పక్షపాతం వచ్చిందా… రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడటానికి ఎందుకు బయపడుతున్నారని మండిపడ్డారు..

Related posts