telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ‌లో రోజురోజుకీ అరాచకాలు ఎక్కువైయ్యాయి..

*తెలంగాణ‌లో శాంతిభద్ర‌త‌లు అదుపుత‌ప్పాయి..
*తెలంగాణ‌లో రోజురోజుకీ అరాచకాలు ఎక్కువైయ్యాయి..
*గ‌వ‌ర్న‌ర్ బాడీ షేమింగ్ చేసే వారిని అరెస్ట్ చేయాలి..

తెలంగాణలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని కాంగ్రెస్ సీనియ‌ర్‌ లీడర్ రేణుకా చౌదరి అన్నారు. గవర్నర్‌ పర్యటనలో అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అన్నారు. ప్రభుత్వానికి అధికారులు తొత్తులుగా మారారని విమర్శించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు ఎందుకు స్పెషల్ టీం పంపడం లేదని ఆమె ప్రశ్నించారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరా అని ఆమె నిలదీశారు. తెలంగాణలో కేంద్ర బృందం దిగాలని రేణుకా చౌదరి కోరారు.

రాష్ట్ర గవర్నర్​, అందులోనూ ఒక మహిళ.. రిమోట్​ ట్రైబల్​ ఏరియాలో పర్యటిస్తున్నప్పుడు కనీస ప్రొటోకాల్​ పాటించటం లేదు. ఐఏఎస్​, ఏపీఎస్​ అధికారులను కేంద్రం నియమిస్తుంది. అలాంటి వాళ్లు.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు తొత్తులుగా మారుతున్నారు.

ప్రజాప్రతినిధులు రాకపోతే.. కనీసం అధికారులైనా రావాలి కదా అని ఆశ్చర్య వ్యక్తం చేశారు. గవర్నర్ రాజ్యాంగ వ్యవస్థలో గౌరవప్రదమైన హోదా అని దానికే గౌరవం ఇవ్వకుంటే పాలన ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఇదేనా పరిపానా విధామని మండిపడ్డారు

బీజేపీ కార్యకర్త చనిపోతే అందుకు కారణమైన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్​పై చర్యలెందుకు తీసుకోవడంలేదని నిలదీశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలపై కూడా తప్పుడు కేసులు పెడుతూ.. వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

కేటీఆర్‌తో వ్యాపార భాగస్వామిగా చెప్పుకునే పువ్వాడ రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ఖమ్మం సూసైడ్ కేసులో మంత్రిఅజయ్‌కుమార్​ను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించి..ఎ-1 గా చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డిని ఖమ్మం రావద్దనే దమ్ము ఎవరికీ లేదన్నారు.

మహిళా గవర్నర్ మీద అసభ్యంగా పోస్టులు పెట్టడం మొగతనం కాదన్నారు రేణుకా చౌదరి. కుసంస్కారంతో చేస్తున్న పనులు ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఏ మహిళ గురించి ఏ పార్టీ నాయకులు మాట్లాడినా ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇకపై తామేంటో చూపిస్తామన్నారు.

Related posts