telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఉద్యోగం కోసం ఉత్తిత్తి పెళ్లి.. సాక్షాత్తు తహసిల్దార్ సంతకంతోనే!

ఉద్యోగం కోసం ఉత్తిత్తి పెళ్లి ఏకంగా తహసిల్దార్ సంతకంతోనే జరిగిపోయింది. అయితే వారిద్దరికీ పెళ్లి కాకున్నా ఐనట్టు సర్టిఫికెట్ ధ్రువీకరణ ఇచ్చారు. వారిద్దరు ఒక్క దగ్గర ఉండకున్న ఉన్నట్లు ధ్రువీకరణ చేశారు. అన్ని పరిశీలించాల్సిన అధికారులు చూసి గుడ్డిగా సంతకాలు చేశారు. ఇది సాక్షాత్తు ఓ మండల తహిసీల్దార్ చేసిన నిర్వాహకం. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని లాల్ సింగ్ తండాలో అంగన్ వాడి పోస్ట్ కోసం అదే తండాకు చెందిన నరేష్ (17) సంవత్సరాలు మరో తండాకు చెందిన కవిత అనే అమ్మాయితో వివాహం అయినట్టు ఫరూక్ నగర్ మండల తహసిల్దార్ పాండు తేదీ 16 /9/2020నాడు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నాట్టు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. దీంతో గ్రామస్థులు తేదీ 30/9/2020 నాడు వాలిద్దరికి వివాహం కాలేదని షాద్ నగర్ ఆర్డీఓకు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసారు. దీంతో తేదీ 1/10/2020/ నాడు తహసిల్దార్ మళ్ళీ దాన్ని క్యాన్సలేషన్ చేసి ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలా ముందు వెనుక చూడకుండా పరుణులు చేయడం ఏంటి… అని విమర్శిస్తున్నారు ప్రజలు.

Related posts