telugu navyamedia
సినిమా వార్తలు

ప్రభాస్‌ సాలార్ ఫోటోలు లీక్ : సోషల్ మీడియాలో వైరల్

పాన్​ ఇండియా హీరో ప్రభాస్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘సలార్​’ ​. ప్రభాస్‌కు జోడిగా శృతి హాసన్ నటిస్తున్నారు. కేజీఎఫ్‌ ` ఫేమ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.

Image

ఈ సినిమా అప్డేట్స్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు.. టీజర్‌ను మే నెలలో గ్లింప్స్​ను విడుదల చేస్తున్నట్లు  టాక్ నడుస్తోంది . ఈ క్రమంలోనే సినిమా షూటింగ్​ స్పాట్​లోని ప్రభాస్​ ఫోటోలు లీక్ అయ్యాయి.

లీకైన ఫోటోల్లో ప్రభాస్ భారీ క‌టౌట్‌తో సిగ‌రెట్ తాగుతూ మాస్​ లుక్​తో కనిపిస్తున్నారు. కేజీఎఫ్‌ తరహాలో ఎలివేషన్లు, యాక్షన్‌ సీక్వెన్స్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

Image

ప్రస్తుతం ఇది సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. ‘కేజీఎఫ్’​కు మించిన మాస్ మసాలా మూవీని ప్రశాంత్​ నీల్​ అందించనున్నారని ఫ్యాన్స్​ ట్వీట్స్​ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది.కాగా, ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించడం సహా పాన్​ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను కేజీయఫ్ నిర్మించిన హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Related posts