చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం “కార్తికేయ-2”. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా మలయాళ కుట్టీ అనుపమ ఫైనల్ అయినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అయితే ఫిలింనగర్ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ నుంచి ఈ భామ తప్పుకుందట. ఈ సీక్వెల్‌కు సంబంధించిన స్టోరీ నెరేషన్‌ను చాలా రోజుల క్రితమే అనుపమకు కథను చెప్పిన చందూ మొండేటి.. తాజాగా పూర్తి స్క్రిప్ట్‌ను వినిపించారట. అయితే అందులో తన పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదని చెప్పిన అనుపమ.. ఈ ప్రాజెక్ట్‌లో తాను చేయలేనని చెప్పిందట. దీంతో టీమ్ మరో హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా మొదటి భాగంలో నిఖిల్ వైద్య విధ్యార్థిగా కనిపించగా, రెండో భాగంలో డాక్టర్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన మోషన్ పోస్టర్, ఫస్ట్‌లుక్‌లు అందరినీ ఆకట్టుకోగా.. ఈ సీక్వెల్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. 2014లో ఘన విజయం సాధించిన కార్తికేయ సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
పెళ్ళైన తరువాత కూడా శత్రుఘ్న సిన్హా ఎఫైర్… భార్య కామెంట్స్