telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఉప్పెన” అవుట్ ఫుట్ పై సుకుమార్ హ్యాపీ… సంతోషంలో శిష్యుడు

Sukumar

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌ని హీరోగా పరిచయమవుతున్న చిత్రం “ఉప్పెన”. చేస్తూ బుచ్చిబాబు సన తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి నటించగా, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు సినీ ప్రేమికులను ఆకట్టుకోగా.. ఉప్పెనపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. కరోనా రాకపోయి ఉంటే రెండు నెలల క్రితమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అయితే అనుకోకుండా కరోనా రావడం, లాక్‌డౌన్‌ విధించడంతో ఈ మూవీ విడుదల వాయిదా పడింది. ఇక లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఈ నెల నుంచి షూటింగ్‌లు జరుపుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవైపు థియేటర్లు కూడా జూలై లేదా ఆగష్టులో తెరిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఉప్పెన చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉప్పెన అవుట్‌పుట్‌ను చూసిన సుకుమార్.. కొన్ని అనవసర సీన్లకు కత్తెర వేసి, సలహాల కోసం చిరంజీవి దగ్గరకు పంపారట. ఇక ఈ అవుట్‌పుట్‌పై సుకుమార్ చాలా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ ప్రేమ కథగా బుచ్చిబాబు ఈ సినిమాను బాగా తెరకెక్కించాడని లెక్కల మాస్టార్ తన శిష్యుడికి కితాబిచ్చినట్లు సమాచారం. దీంతో ఈ యువ దర్శకుడు కూడా సంతోషం వ్యక్తం చేసినట్లు టాక్.

Related posts