మెగాస్టార్ పవన్ కళ్యాణ్, అలీకి మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. లాక్‌డౌన్ సందర్భంగా అలీ కొన్ని ఛానెల్స్‌లో లైవ్‌లో పాల్గొంటున్నారు. ఇంటర్వ్యూలో ఇస్తున్నారు. లాక్‌డౌన్‌లో తను ఏం చేసింది? ఏం చేస్తుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది వంటి విషయాలను పంచుకున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పవన్ గారికి నేనంటే చాలా ఇష్టం. నా కామెడీ అన్నా, హావభావాలు అన్నా ఆయన బాగా ఇష్టపడతారు. మేము ఏదైనా స్టేజ్ మీద ఉన్నప్పుడు సీక్రెట్‌గా సైగలు చేసుకుంటూ ఉంటాం. ఆ సైగలు ఎవ్వరికీ తెలియవు. దాదాపు ఆయన నటించిన అన్ని చిత్రాలలో నేను నటించాను. అన్నయ్య చిరంజీవిగారి కోసం వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు కళ్యాణ్‌గారు ఆప్యాయంగా పలకరించేవారు. అప్పటికి ఆయన సినిమాల్లోకి రాలేదు. ఆయన సినిమాలలో మొదటి నుంచి ఉన్నప్పటికీ ‘తొలిప్రేమ’ చిత్రం నుంచి మా మధ్య అనుబంధం బాగా బలపడింది. ప్రతి సంవత్సరం అన్నయ్య చిరంజీవిగారు ఆవకాయ పచ్చడి పంపిస్తారు. పవన్ కల్యాణ్‌గారు సేంద్రీయ పద్ధతులలో పండించిన మ్యాంగోస్ పంపుతారు. కానీ ఈ సంవత్సరం ఆయన రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల పంపలేదు. వచ్చే సంవత్సరం పంపుతారని అనుకుంటున్నాను’’ అని అలీ చెప్పుకొచ్చారు. గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్, అలీల మధ్య కొన్ని విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా వీరిద్దరి గురించి అందరికీ తెలుసు. కానీ రాజకీయాలకు వచ్చేసరికి ఏదైనా జరగవచ్చు. అదే జరిగింది వీరిద్దరి మధ్య. అయితే ఆ తర్వాత మాత్రం అలీ చాలా సందర్భాల్లో పవన్ గురించి కూల్‌గానే మాట్లాడారు. పవన్ విషయంలో ఆ తర్వాత ఎప్పుడూ అలీ ప్రస్తావన రాలేదు.
previous post
next post