telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తాజ్ మహల్‌ ఒక సమాధి… ప్రపంచ వింతకాదు… రంగోలి రనౌత్ కామెంట్స్

rangoli

కంగనా రనౌత్ చెల్లెలు రంగోలి రనౌత్ తాజాగా తాజ్ మహల్ గురించి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. తాజ్ మహల్‌ను చాలామంది సమాధిగానే భావిస్తారు. కానీ దీనిని ప్రపంచ వింతగా చూడాలని ప్రజలను బలవంతం చేస్తున్నారంటూ రంగోలి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముంతాజ్‌పై ఉన్న ప్రేమ, గౌరవంతో షాజాహాన్‌ నిర్మించిన ఈ అతిపెద్ద కట్టడం వెనుక ఒళ్ళు గగుర్పొడిచే విషయాలెన్నో ఉన్నాయి, ఆమెను షాజహాన్‌ ఎంతగా హింసించేవాడో మీకు తెలుసా?..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. రంగోలి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రంగోలిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 

Related posts